Nagaram Janardhan Reddy: కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-08-17T17:12:01+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి (Nagaram Janardhan Reddy) విమర్శలు గుప్పించారు.

Nagaram Janardhan Reddy: కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి (Nagaram Janardhan Reddy) విమర్శలు గుప్పించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

"కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల‌ కోట్ల కుంభకోణం జరిగింది. తనకు, గాంధీ భవన్‌కు దూరం పెరగలేదు. అవినీతిపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్‌లదే బాధ్యత. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై తాడో పేడో పేల్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీలకు సూచన. కర్ణాటకలో 40 శాతం అవినీతి సరే.. తెలంగాణలో 70శాతం కమిషన్‌పై మా పార్టీ కాంగ్రెస్ పోరాటం చేయాలి.రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని మౌనంగా ఉంటున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చీడ పురుగుగా మారారు." అని నాగం జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


"మెగా కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదికారిగా మారారు. గాలి జనార్ధనరెడ్డి మాదిరి.. మెగా కృష్ణారెడ్డిని సైతం విడిచిపెట్టను. కాళేశ్వరం డబ్బుతో మెగా కృష్ణారెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. కృష్ణా నదీ జలాల అంశంలో తెలంగాణ ప్రమాదంలో పడటానికి సీఎం కేసీఆర్ కారణం. తెలంగాణ నిధుల లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?. ఇంటికో ఉద్యోగం ఇవ్వకుంటే తల‌ నరుక్కుంటానన్న కేసీఆర్ ఎన్నిసార్లు నరుకున్నాడు?. 2004లో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి.. దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్‌గా ఎలా ఎదిగారు." అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-08-17T17:17:23+05:30 IST