Share News

HYD: నగరంలో.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2023-11-07T08:45:59+05:30 IST

ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో మంగళవారం బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి

HYD: నగరంలో.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

- ప్రధాని మోదీ సభ నేపథ్యంలో..

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో మంగళవారం బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) హాజరవుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అబిడ్స్‌, నాంపల్లి, రవీంద్రభారతి, ట్యాంక్‌బండ్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయన్నారు. బహిరంగ సభకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను కేటాయించినట్లు వెల్లడించారు.

పార్కింగ్‌ ప్రాంతాలు..

- సికింద్రాబాద్‌, ట్యాంక్‌బండ్‌, అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా వచ్చే అన్ని వాహనాలు లిబర్టీ, బషీర్‌బాగ్‌, ఆయకార్‌ భవన్‌ వద్ద దిగి వాహనాలు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద పార్క్‌ చేసుకోవాలి

- మెహిదీపట్నం నుంచి నిరంకారి, పాత సైఫాబాద్‌, ఇక్బాల్‌ మీదుగా వచ్చే వాహనాలు మినార్‌, రవీంద్రభారతి, హెచ్‌టీపీ జంక్షన్‌, పబ్లిక్‌ గార్డెన్‌ లోపల వాహనాలు పార్కు చేసుకోవాలి.

- ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.

- వీఐపీల వాహనాలు టెన్నిస్‌ కోర్టు వద్ద పార్క్‌ చేయాలి

- మీడియా వాహనాలు నిజాం కళాశాల గేటు-1 వద్ద దిగి మహబూబియా కాలేజీలో పార్కు చేసుకోవాలి.

modi.jpg

Updated Date - 2023-11-07T08:46:01+05:30 IST