ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

ABN, First Publish Date - 2023-02-06T11:20:18+05:30

అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : అసెంబ్లీ (Assembly) అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender)ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ (Minister KTR) పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా.. ఆయనను దూరం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (TRS MLA Marri Janardhan Reddy) విష్ చేశారు. ఈటల చూడక పోవడంతో జనార్దన్ రెడ్డి దగ్గరకు వెళ్లి మరీ విష్ చేశారు. దీంతో ఈటల అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల, మర్రిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

తనను విష్ చేసిన మర్రి జనార్ధన్ రెడ్డితో ఈటల.. ‘ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు (BRS MLAs) నన్ను విష్ చేసే దైర్యం చేస్తారా?’ అన్నారు. దీనికి మర్రి.. రాజకీయాలు వేరు.. మానవ సంబంధాలు వేరు. విష్ చేసే ధైర్యం ఎందుకు లేదంటూ ఈటల రాజేందర్‌ను మర్రి ఆలింగనం చేసుకున్నారు. అసలు ఇప్పుడు విలువలు ఎక్కడున్నాయని ఈటల ప్రశ్నించారు. వేడి నూనెలో వేయించి ఎలా ఉందని అడిగినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan Rao) సైతం వేర్వేరు పార్టీల నేతలు మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. నేను పనుల కోసం హరీష్ రావు (Harish Rao)ను కలిస్తే బీఆర్ఎస్‌ (BRS)లో చేరుతున్నట్లు మీడియాలో వస్తోందన్నారు. అక్బరుద్దీన్ (Akbaruddin) మిత్రులకు కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. వారి పని చేయడం సాధ్యం కాదని కేటీఆర్ మొహం చాటేస్తున్నారన్నారు. దీంతో అక్బరుద్దీన్‌కు మండి అసెంబ్లీలో కేటీఆర్‌పై ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T11:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising