Bandi Sanjay: ఆ మాటలకు కట్టుబడి ఉన్నా
ABN, First Publish Date - 2023-02-14T14:34:56+05:30
తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి స్పందించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State President Bandi Sanjay) మరోసారి స్పందించారు. మంగళవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy)తో మాట్లాడుతూ... సెక్రటేరియట్ డోమ్ కూల్చివేస్తామన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్‌పై తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తామని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (Congress, BRS)ను వేరువేరుగా చూడడం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటే అని.. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అధికారంలోకి రామని కాంగ్రెస్ నాయకులే (Congress Leaders) చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ యాత్ర (Congress Partay Padayatra)లు చేయడం ఎందుకు బీఆర్‌ఎస్ (BRS)ను తిట్టడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) ఒంటరిగా పోటీ చేస్తుందని...119 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి వెళ్తామని తేల్చిచెప్పారు. 119 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామన్నారు. సెక్యులర్ పదంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం (MIM)లు ముందుకు వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయని అన్నారు. దేవుడు మనోభావాలను కించపరిచిన ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ ఏ విధంగా అవుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
కాగా... ఇటీవల జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా కూకుట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లిలో తలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో భాగంగా తెలంగాణ నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయం డోమ్‌ను కూల్చివేమని అన్నారు. నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని అన్నారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపాయి.
Updated Date - 2023-02-14T14:34:58+05:30 IST