BJP: హైదరాబాద్‌కు మోదీ... భారీ బహిరంగ సభ.. ఎప్పుడంటే...
ABN, First Publish Date - 2023-02-14T12:59:09+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా అధ్యక్షతన తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షతన తెలంగాణ (Telangana) లో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ( BJP state affairs in-charge Tarun Chugh) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union minister Amit Shah) ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని.. ఆయన ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమ యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 11వేల సభలు పెడతామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజవర్గం, శాసనసభ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గాల్లో వందకు పైగా సభలు ఉంటాయన్నారు. నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని చెప్పారు. చివరగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. దానికి ప్రధానమంత్రి మోదీ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ప్రజాగోసా బీజేపీ భరోసా’’ అనే నినాదంతో చేపడతామని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-02-14T12:59:10+05:30 IST