Chandrababu : గద్దర్‌పై కాల్పుల ఘటనపై స్పందించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2023-08-15T12:46:51+05:30 IST

ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu : గద్దర్‌పై కాల్పుల ఘటనపై స్పందించిన చంద్రబాబు

హైదరాబాద్ : ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. తనతో అనేక సార్లు మాట్లాడారన్నారు.


తన లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటేనని.. పేదల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని చంద్రబాబు అన్నారు. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకమన్నారు. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారన్నారు. గద్దర్ జీవితం బావి తరాలకు ఆదర్శమని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-08-15T13:04:53+05:30 IST