అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు రూ.4.33 కోట్ల టోకరా..
ABN , First Publish Date - 2023-10-30T09:07:59+05:30 IST
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి రూ. 4.33 కోట్ల టోకరా పెట్టాడు. కార్పొరేట్ క్రెడిట్ కార్డుతో నగదు కొట్టేశాడు. ఏకంగా బ్యాంకు సెక్యూరిటీ అలర్ట్ సిస్టంను తప్పుదోవ పట్టించి నగదు కొట్టేశాడు.

హైదరాబాద్ : అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకుకు ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి రూ. 4.33 కోట్ల టోకరా పెట్టాడు. కార్పొరేట్ క్రెడిట్ కార్డుతో నగదు కొట్టేశాడు. ఏకంగా బ్యాంకు సెక్యూరిటీ అలర్ట్ సిస్టంను తప్పుదోవ పట్టించి నగదు కొట్టేశాడు. సోమాజిగూడలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగి యార్లగడ్డ ప్రదీప్ ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. కార్డు ద్వారా బ్యాంకింగ్ అలర్ట్స్ సిస్టంను తప్పుదోవ పట్టిస్తూ దఫ దఫాలుగా రూ. 4.33 కోట్ల వరకు లావాదేవీలు జరిపాడు. రీపేమెంట్ జరగకపోవడంతో అనుమానం వచ్చి బ్యాంక్ సిబ్బంది ఆరా తీసింది. యార్లగడ్డ ప్రదీప్ అప్పటికే ఉద్యోగం మానేసినట్టు నిర్ధారణ అయ్యింది. బ్యాంక్ అధికారుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.