Crime News: శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 09:49 AM
రాజధాని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో వినయ్‌తోపాటు అతని అక్కను అరెస్టు చేశారు.

హైదరాబాద్: సింగం శిరీష (Singam Shirisha) హత్య కేసు (Murder Case)లో ట్విస్ట్ (Twist) నెలకొంది. ఆమె భర్త తన అక్క కోసమే భార్యను హత్య చేశాడు. అక్క మాట వినకుండా ఆమెకు ఎదురు తిరుగుతోందని హత్య చేశాడు. శిరీషకు మత్తుమందు (Anesthetic) ఇచ్చి.. స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి భార్యను హత్య చేశాడు. అనంతరం శిరీష గుండెపోటుతో చనిపోయిందని మేనమామకు తెలిపాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే ఉంచాలని మేనమామ చెప్పినా వినకుండా అతను వచ్చేలోగా వినయ్ డెడ్ బాడీని తరలించాడు. సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్‌ను ట్రేస్ చేసి మేనమామ పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని దోమలు పెంట వద్ద పట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు వినయ్‌తోపాటు అతని అక్కను అరెస్టు చేశారు.
Read More..:
సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు
విస్తుపోయే విషయాలు
రాజధాని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శిరీష కన్నా ముందు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న వినయ్ కుమార్.. మొదటి భార్యను ఇలాగే హత్య చేయగా, రెండో భార్య అతని వేధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. శిరీషను కూడా వారు కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువుల అండదండులు లేని శిరీష వారి వేధింపులను చాలాకాలం మౌనంగా భరించింది. కానీ ఇటీవల వేధింపులు మరీ ఎక్కువ కావడంతో భర్తతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి శిరీషకు ఆమె ఆడపడుచు సరితకు మధ్య గొడవ తలెత్తింది. ఇద్దరూ ఒకరిపై మరోకరు తీవ్రస్థాయిలో పరుష పదజాలాలతో దుర్భాషలాడుకున్నారు.
క్షణికావేశానికి గురైన ఆడపడుచు శిరీషను కొట్టింది. దీంతో శిరీష ఆమెపై ఎదురు తిరగడంతో భర్త వినయ్‌కుమార్ కూడా తన సోదరి సరితకు తోడుగా దాడికి దిగాడు. ఎలాగైనా శిరీష అడ్డు తొలగించుకోవాలని వినయ్, సరిత పథకం వేశారు. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్ కావడంతో.. శిరీషకు బలవంతంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు నులిమి, దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం ఏమీ తెలియనట్లు.. అన్న, చెల్లెలు ఇద్దరూ కలిసి శిరీషకు ఛాతీలో నొప్పి వచ్చిందని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శిరీష మృతదేహాన్ని వెంటనే దహనం చేసేందుకు.. వినయ్, సరిత కలిసి అంబులెన్స్‌లో వారి స్వగ్రామానికి బయల్దేరు. కానీ, శిరీష మేనమామ మధుకర్ ఫిర్యాదుతో వారి పథకం పారలేదు. పోలీసులు వినయ్‌తో పాటు, అతని సోదరి సరితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తల్లిదండ్రులు లేరని తెలిసే..
శిరీషకు తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న వినయ్‌కుమార్ ఒక పథకం ప్రకారమే ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడు. అతని నేర చరిత్ర గురించి తెలియని శిరీష .. ప్రేమ మైకంలో పడి, తనను పెంచుకున్న తల్లిదండ్రులను కాదనుకొని మరీ వినయ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కానీ.. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే శిరీషను వినయ్ కుమార్, ఆడపడచు సరిత, ఇతర కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారని.. చివరకు భర్త, అడపడచు కలిసి శిరీషను దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన..
పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News