Share News

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

ABN , Publish Date - Mar 05 , 2025 | 09:04 AM

ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు
Singer Kalpana

హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని కల్పన (Singer Kalpana) ఆరోగ్యం నిలకడగా (Consistent health) ఉన్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను అమె ఉంటున్న విల్లా వాసులు ఆసుపత్రి (Hospital)లో చేర్చారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె రెండో భర్త తో కలిసి ఉంటున్నారు. రెండు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉన్నారు. చెన్నై లో ఉంటున్న భర్త ఫోన్ చేయగా కల్పన ఎత్తకపోవడంతో స్దానిక విల్లా వాసులకు ఆయన ఫోన్ చేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో విల్లా వాసులు ఇంటి తలుపులు బ్రేక్ చేసి.. బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం రాత్రి చెన్నై నుంచి ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కల్పన ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళారు. మానసిక ఒత్తిడి కారణంగా అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More...

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన..


కల్పన బహుభాషా నేపథ్య గాయని

కాగా ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. 27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశవిదేశాల్లో 3వేలకు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె బిగ్‌బాస్‌ షోలో కూడా పాల్గొన్నారు. ఈటీవీ నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమంతో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. మహాశివరాత్రి రోజున సంగారెడ్డిలో నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని పాటలు పాడారు. ఆమె హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్‌ ప్రివిలేజ్‌ విల్లా్‌సలో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్‌ సభ్యులు ఆమెకు ఫోన్‌ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు.


బెడ్‌పై అపస్మారక స్థితిలో..

చెన్నైకి చెందిన ఆమె భర్త ప్రసాద్‌ కూడా మంగళవారం ఉదయం నుంచి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆయన కెపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రధాన ద్వారం తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటి వెనక వంట గది నుంచి లోపలికి వెళ్లారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్నారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించారు. హుటాహుటిన కల్పనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కల్పన భర్త ప్రసాద్‌ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అతన్ని పోలీసులు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్పనను చూసేందుకు సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఆస్పత్రికి వచ్చారు.

ఎన్నో ఆటుపోట్లు..

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కల్పన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2010లో భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో ఎదురైన సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. అప్పుడు ప్రముఖ గాయని చిత్ర తనకు ధైర్యం చెప్పారని ఓ ఇంటర్వ్యూలో కల్పన చెప్పారు. భర్తతో విడిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైందని, పిల్లలను చదివించుకోలేకపోయానని కూడా ఆమో ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిత్ర సూచన మేరకు పాటల పోటీలో పాల్గొని గెలవడంతో తన కష్టాలు తీరాయని చెప్పారు. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా కల్పనకు చిత్ర పరిశ్రమలో గుర్తింపు ఉందని, అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోసానిపై మరో కేసు..14 రోజుల రిమాండ్..

కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 05 , 2025 | 09:04 AM