ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR Wishes: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి సీఎం కేసీఆర్ అభినందనలు

ABN, First Publish Date - 2023-03-13T10:30:49+05:30

‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ (RRR)సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు (Oscar Award) రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ (Telangana) సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు.

చంద్రబోస్, కీరవాణిలకు ప్రత్యేక అభినందనలు...

తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌ (Chandrabose)ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి (MM Keeravani), కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), గాయకులు రాహుల్ సిప్లిగంజ్(Rahuli Sipligunj), కాలభైరవ (Kala Bhairava), నటులు రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది...

నిర్మాణ విలువలపరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్‌ (Hollywood)కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ (Hyderabad) గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని అన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికిగర్వకారణమని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజనీ, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదనీ, కరోనా (Corona virus) కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని సీఎం కేసీఆర్ (Telangana CM) ఆకాంక్షించారు.

Updated Date - 2023-03-13T10:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising