CM Candidate: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠకు కాసేపట్లో తెర !
ABN, First Publish Date - 2023-12-04T14:45:10+05:30
Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం సీఎల్పీ (CLP Meeting) సమావేశం జరగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలనే దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఇప్పటికే సీఎల్పీ తీర్మానం ఢిల్లీకి కూడా చేరింది.
రేవంత్ రెడ్డి వైపు మొగ్గు?
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఏఐసీసీ (AICC) నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సీఎల్పీ ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (AICC Chief Mallikarjuna Kharge) అప్పగించిన నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీలను (RAhul Gandhi) సంప్రదించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపుల తరువాత సీఎం అభ్యర్థిని ఖర్గే ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రమే సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Updated Date - 2023-12-04T15:02:13+05:30 IST