New Secretariat ప్రారంభానికి ముందు ఇలా జరిగిందేంటి?

ABN , First Publish Date - 2023-02-03T07:27:14+05:30 IST

నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కే తలమానికంగా దాని నిర్మాణం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

New Secretariat ప్రారంభానికి ముందు ఇలా జరిగిందేంటి?

Hyderabad : నూతన సచివాలయం (New Secretariat) ప్రారంభానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ (Hyderabad)కే తలమానికంగా దాని నిర్మాణం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి (Secretariat Inaguration) ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న దీని ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ (CM KCR) ముహూర్తం ఖరారు చేయించారు. ఈ సమయంలో నూతన సెక్రటేరియట్ భవనం వెనుక భాగంలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఐదు, అరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్ని మాపక శాఖ అధికారులు.. 11 ఫైర్ ఇంజన్లతో మంటలు అర్పివేశారు.

అగ్ని ప్రమాద స్థలిని ఫైర్ డీజీ నాగిరెడ్డి (DG Nagireddy) పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం అది మాక్ డ్రిల్ (Mock Drill) అంటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటేరియట్ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ అని చెప్పడం గమనార్హం. అగ్ని ప్రమాద సమయంలో పొగలు సచివాలయ భవనం దట్టంగా వెలువడ్డాయి. పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.

Updated Date - 2023-02-03T09:40:40+05:30 IST