KTR and Etela మధ్య ఆసక్తికర సన్నివేశం..
ABN, First Publish Date - 2023-02-04T03:46:07+05:30
శాసనసభలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్ విపక్ష సభ్యులందరినీ పలకరించారు.
అసెంబ్లీలో ఈటల రాజేందర్ వద్దకు వెళ్లి ప్రశ్నించిన కేటీఆర్
రావాలంటే పిలవాలి కదా.. అని జవాబు ఇచ్చిన ఈటల
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్ (Minister KTR) విపక్ష సభ్యులందరినీ పలకరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender)తో రెండుసార్లు ప్రత్యేకంగా మాటామంతీ జరిపారు. ఇటీవల హుజూరాబాద్ (Hyderabad) నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రొటోకాల్ (Protocal) అంశం వీరి మధ్య చర్చకు వచ్చింది. ‘‘అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదు?’’ అని మంత్రి కేటీఆర్.. ఈటలను ప్రశ్నించగా, ‘పిలిస్తే కదా హాజరయ్యేది!’ అంటూ ఈటల బదులిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగ్గా లేదని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో అన్నారు. కాగా, ఆ సమయంలో ఈటల వెనకాలే ఉన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఎంట్రీ అయి.. ఈటల నెత్తిని నిమురుతూ కనిపించారు. ఇక కేటీఆర్ రాకతో మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (BJP MLA Raghunandan Rao) లేచి నిలబడేందుకు ప్రయత్నించగా.. కేటీఆర్ ఆయనను కూర్చోబెట్టి ఈటలతో కాసేపు మాట్లాడారు. ఈ క్రమంలో గవర్నర్ సభలోకి వస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (Sandra Venkata Veeraiah) కేటీఆర్‌కు సమాచారం ఇవ్వడంతో ఈటలతో మాటామంతీ ముగిసింది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావును కేటీఆర్ పలకరించి.. కుర్చీలో కూర్చున్నారు.
Updated Date - 2023-02-04T07:56:22+05:30 IST