ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan reddy: మజ్లిస్ ఆత్మ కాంగ్రెస్‌ను వీడి కేసీఆర్ కుటుంబంలో చేరింది

ABN, First Publish Date - 2023-09-15T20:01:24+05:30

మజ్లిస్(Majlis) ఆత్మ కాంగ్రెస్‌(Congress)ను వీడి కేసీఆర్(KCR) కుటుంబంలో చేరిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు.

హనుమకొండ : మజ్లిస్(Majlis) ఆత్మ కాంగ్రెస్‌(Congress)ను వీడి కేసీఆర్(KCR) కుటుంబంలో చేరిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. శుక్రవారం నాడు పరకాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను పర్మిషన్ తీసుకుని ఉపవాస దీక్ష చేస్తే పోలీసులు భగ్నం చేశారు.అందువల్లే నాగొంతు ఇబ్బందిగా ఉంది.సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు, రజాకార్ల పీడ విరగడైన రోజు. తెలంగాణలో బురుజులు కట్టుకుని మాన, ప్రాణాలను కాపాడుకున్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన రోజును కాంగ్రెస్ పార్టీ భయటకు రాకుండా చేసింది.

తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) జరపకుండా చేసిన ఈపాపం కాంగ్రెస్‌దే.సోనియాగాంధీకి సెప్టెంబర్ 17న మీటింగ్ పెట్టే అర్హత లేదు.సెప్టెంబర్ 17న చరిత్రను దేశానికి తెలియనివ్వలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు చార్మినార్ దగ్గర ముక్కు నేలకు రాకాకే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టాలి.నాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయ్..? మజ్లిస్ అంటకాగుతున్నం దునే విమోచన దినోత్సవం జరపడం లేదు. సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుంది కేసీఆర్..?సమైక్యతా దినం అనేవాళ్లు మూర్ఖులు, చరిత్ర హీనులు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే సమైక్యదినం అంటున్నారు. కేసీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారు.సెప్టెంబర్ 17పై పరకాల అమరధామం దగ్గర చర్చకు కేసీఆర్ సిద్ధమా...?. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-15T21:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising