ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: రైతుబంధు ఆపాలంటూ ఈసీకి లేఖపై కేటీఆర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-26T09:35:43+05:30

రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'రైతుబంధు' సాయాన్ని ఆపాలంటూ ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)అమలు చేస్తున్న 'రైతుబంధు' సాయాన్ని ఆపాలంటూ ఈసీకి కాంగ్రెస్ (Congress) లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-10-26T09:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising