ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Assembly: అలహాబాద్‌లో మెట్రో ఎక్కుతారట... ఇక్కడ ఎక్కరట.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ABN, First Publish Date - 2023-02-11T14:17:40+05:30

హైదరాబాద్‌ మెట్రోకు కేంద్ర సహకరించడం లేదంటూ మంత్రి కేటీఆర్ కేంద్రపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) కేంద్ర సహకరించడం లేదంటూ మంత్రి కేటీఆర్ (Minister KTR) కేంద్రపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ... కేవలం బీజేపీ (BJP) అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోందని ఆరోపించారు. శత్రుదేశంలా తెలంగాణ (Telangana)పై కేంద్రం పగపెంచుకుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

‘‘ఒడ్డించే వాడు మనవాడైతే ఎక్కడైనే పెట్టుకోవచ్చు’’ అన్న విధంగా మెట్రోపై కేంద్రం తీరు ఉందని విమర్శించారు. బీజేపీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు, వాళ్లకు అనుకూలంగా ఉండే వారు, అడుగులకు మడుగులు వత్తే వారికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ మెట్రో గురించి కేంద్రం వద్ద వెళ్లగా... అడ్డగోలు ప్రశ్నలతో వెనక్కి పంపుతున్నారన్నారు. ఇంత పెద్ద మహానగరానికి నిధులు ఇచ్చేందుకు వయోబులిటీ లేదని, ప్రయాణికులు లేరంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు ఎంతో మంది ప్రయాణిస్తున్నారని.. ప్రయాణికులతో మెట్రో కోచ్‌లు కిక్కిరిసిపోతున్నాయన్నారు. అదనంగా కోచ్‌లు పెంచాలని, ట్రైన్‌లు పెంచాలంటూ తమపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయాలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయన్నారు. అలహాబాద్‌లో ప్రయాణికులు ఎక్కుతారట... హైదరాబాద్‌లో ఎక్కరట.. ఎదెక్కడి నీతని ప్రశ్నించారు. శత్రుదేశంపై పగపెంచుకున్నట్లు తెలంగాణ ప్రజలపై కేంద్ర పగపెంచుకోవడం ఎంత వరకు తగునో ప్రధాని (PM Narendra Modi) విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Updated Date - 2023-02-11T14:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising