ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Sridhar Babu: ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది

ABN, Publish Date - Dec 22 , 2023 | 06:27 PM

పార్లమెంట్‌లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: పార్లమెంట్‌లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పే ధైర్యం లేక ఎంపీలను సస్పెండ్ చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేస్తే..కాంగ్రెస్ కోర్టుకి పోయి ధర్నా చౌక్ కోసం కొట్లాడింది. నియంతృత్వ పోకడలతో వెళ్లినందుకే బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పారు. బీజేపీ‌కి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.

బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు

బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన కేసీఆర్‌ని ప్రజలు గద్దె దించారు. పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేసిన మోదీని కూడా ప్రజలే గద్దె దించుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 06:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising