MP Komatireddy: మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది..
ABN , First Publish Date - 2023-07-14T16:07:43+05:30 IST
నల్గొండ: కరెంట్ 11 గంటల కన్నా ఎక్కువ రావడం లేదని తాను చెప్పడంతోనే నల్గొండ జిల్లాలోని 350 సబ్ స్టేషన్లలో లాగ్ బుక్స్ గుంజుకెళ్లారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్గొండ: కరెంట్ 11 గంటల కన్నా ఎక్కువ రావడం లేదని తాను చెప్పడంతోనే నల్గొండ జిల్లాలోని 350 సబ్ స్టేషన్లలో లాగ్ బుక్స్ గుంజుకెళ్లారని కాంగ్రెస్ (Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkatareddy) అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన నల్గొండలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ (Minister KTR) తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పరేషాన్‌లో ఉన్నారని, 24 గంటల కరెంటు ఇవ్వడం కేటీఆర్‌కు చేత కాదని.. కనీసం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనైనా బాత్రూమ్స్ బాగు చేయించాలని సూచించారు.
ఈ సందర్భంగా హిమాన్ష్ (Himansh)...శభాష్.. అంటూ.. తాతకు, తండ్రికి బుద్ధి చెప్పావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న హిమాన్ష్‌ను చూసైనా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. మేము చేసేదే చెబుతామని అన్నారు. ఈ నెల 20న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సభలో మహిళల కోసం డిక్లరేషన్ చేయబోతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగులకు రూ.5 వేల పెన్షన్ ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
