ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KA Paul: కవిత అరెస్ట్‌ ప్రచారంపై కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-16T14:14:35+05:30

కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ (CM KCR) మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (Prajashanti Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (KCR) రూ.600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయాని (Kondagattu Temple) కి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ (RSS) అజెండాను కేసీఆర్ (Telangana CM) అమలు పరుస్తున్నారని ఆరోపించారు. కూతురు కవిత (MLC Kavitha) అరెస్ట్‌ను తప్పించడానికేనా అని ప్రశ్నించారు. కేసీఆర్.. బీజేపీ (BJP) బీ టీమ్ అని మరోసారి నిరూపించుకుంటున్నారన్నారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ (KTR) అరెస్ట్ కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ తాను సెక్యులర్ (Secular) అని చెప్పుకుంటూ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.

రాష్ట్ర ఖజానాలో డబ్బుల లేవని ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన నిధులను ఒకటి, రెండు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రజలు ఈ విషయంపై కేసీఆర్‌ను ప్రశ్నించాలన్నారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళతారని అన్నారు. ఏప్రిల్ 14న తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నారు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలు(Telangana People) కలెక్టరేట్‌లను ముట్టడించవద్దని పాల్ విజ్ఞప్తి చేశారు. తాను నిజమైన హిందువును అని.. హిందువుగానే చనిపోతాను.. కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతాను అంటూ కేఏపాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-16T14:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising