KA Paul: దేవుడు, నేను వద్దనుకున్నాం... అందుకే కాలిపోయింది
ABN , First Publish Date - 2023-02-03T12:52:13+05:30 IST
నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు.
హైదరాబాద్: నూతన సచివాలయం (News Secretariat)లో అగ్నిప్రమాదం ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ (Praja Shanti Party leader KA PauL) స్పందించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్‌ను కేసీఆర్ (Telangana CM KCR) పుట్టిన రోజు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కూలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎంతో కాలం చెల్లదని... కేసీఆర్ (Telangana CM) ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవరని.. ఇక ప్రధాని ఏం అవుతారని ఆయన ఎద్దేవా చేశారు.
అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది... పండు ఒకరిదా అని నిలదీశారు. సచివాలయం ప్రారంభంపై హైకోర్టు (Telangana HighCourt)లో పిల్ వేసినట్లు తెలిపారు. అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంపైనా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న సెక్రటరియట్ వెళ్తే కూడా అడ్డుకున్నారని అన్నారు. కేసీఆర్.. తెలంగాణలో ఈ గుండాయిజం ఏంటని ప్రశ్నించారు. ‘‘నన్ను హైదరబాద్, తెలంగాణాలో బ్యాన్ చేద్దామని అనుకుంటున్నారా’’ అంటూ కేఏ పాల్ మండిపడ్డారు.