Sunita Rao: బీఆర్ఎస్ నేతలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి

ABN , First Publish Date - 2023-08-31T15:02:44+05:30 IST

బీఆర్ఎస్ నేతలు(BRS leaders) మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావ్(Sunita Rao) అన్నారు.

Sunita Rao:  బీఆర్ఎస్ నేతలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు(BRS leaders) మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావ్(Sunita Rao) అన్నారు. గురువారం నాడు ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలకు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి(MLA Marri Janardhan Reddy) మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. 400 రూపాయలు ఇస్తే ప్రచారానికి రావాలని అంటున్నారని.. కేసీఆర్‌కు కవిత ఒక్కతే బిడ్డనా? రాష్ట్ర మహిళలు కాదా? అని ప్రశ్నించారు. కవిత 33 శాతం రిజర్వేషన్ అంటుదని.. బీఆర్ఎస్‌లో ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నేతల ప్రచారానికి మహిళలు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలను కించపరిచిన మర్రి జనార్థన్‌ను బయట తిరగకుండా అడ్డుకుంటామని సునీతారావ్ హెచ్చరించారు.

Updated Date - 2023-08-31T15:02:44+05:30 IST