Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై మరోసారి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
ABN , First Publish Date - 2023-09-27T13:51:07+05:30 IST
గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు.
హైదరాబాద్ : గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు. బయోమెట్రిక్ ఏర్పాటు చేయకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యవస్థపై నమ్మకం కోల్పోవడంతోనే గతంలో రాసిన 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయలేక పోయారని న్యాయస్థానం అభిప్రాయపడింది.
గ్రూప్ 1 పరీక్ష రద్దుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్‌లో 2,83 లక్షలు మంది అభ్యర్థులు గ్రూప్ 1 రాశారని.. రెండోవ సారి 2.33 లక్షల మంది రాశారని అడ్వకేట్ జనరల్ అన్నారు. మొదటి సరికి, రెండోవ సరికి 50 వేల మంది గ్రూప్1 రాయలేదని హైకోర్టు పేర్కొంది. వ్యవస్థపై నమ్మకం కోల్పోయి రెండోవ సారి రాయలేదని వ్యాఖ్యానించింది. మొదటి సారి 2.85 లక్షల మంది బయో మెట్రిక్ తీసుకునప్పుడు, రెండో సారి 2.33 లక్షల మందికి ఎందుకు సమస్య వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ వేసింది ముగ్గురు అభ్యర్థులని.. వారి కోసం కోసం మొత్తం పరీక్షను రద్దు చేయమనడం సమంజసం కాదన్నారు. బయోమెట్రిక్ పెట్టడం, పెట్టకపోవడమనేది టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయమన్నారు. నిబంధనలను సరిచేసుకునే వెసలుబాటు టీఎస్‌పీఎస్సీకి ఉంటుందన్నారు.