Kishan Reddy: జీ20 సమావేశాల గురించి కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-12T16:14:28+05:30 IST

భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో

Kishan Reddy: జీ20 సమావేశాల గురించి కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..!
Kishan Reddy

హైదరాబాద్: భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్ వేదికగా జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారు. హైటెక్స్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణం మార్పు తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారు. ఆహారం కోసం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై కూడా చర్చిస్తారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19, 20, 21, 22 తేదీల్లో గోవాలో జరుగుతాయి. గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్‌ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సాంస్కృతిక శాఖ ఫైనల్ మీటింగ్‌లు వారణాసిలో జరుగుతాయి. ప్రగతి మైదాన్‌లో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో 18వ జీ20 చివరి సమావేశాలు జరుగుతాయి.’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-06-12T16:14:28+05:30 IST