బీఆర్‌ఎస్, బీజేపీలకు తగిన గుణపాఠం తప్పదు
ABN , First Publish Date - 2023-03-08T23:51:44+05:30 IST
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్థానాలను నెర వేర్చని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, మార్చి 8: ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్థానాలను నెర వేర్చని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ లక్ష్మి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరై మాట్లాడా రు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో జగి త్యాల నియోజక వర్గంలో చేపట్టనున్న పాదయాత్రకు కార్యకర్తలు వేలాదిగా తర లిరావాలని పిలపునిచ్చారు. కేసీఆర్ మాటలు నమ్మే రోజులు పోయాయని, కాం గ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. బీజేపీ ప్రజలకు చేసింది ఏమి లేదని యండిపడ్డారు. అనంతరం జోడో యాత్ర అవగాహన పోస్టర్లును ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ లక్ష్మితో పాటు మహిళా నాయకురాళ్లను షాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్, మోయిజోధ్దీన్, దుర్గయ్య, మన్సూర్, అశోక్, రాజేందర్, జగన్, రమేష్ రావు, రాము, శ్రీనివాస్, హరికృష్ణ, జగదీశ్వర్, మధు ఉన్నారు.