ఘనంగా బోనాలు

ABN , First Publish Date - 2023-03-13T00:26:55+05:30 IST

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు

ఘనంగా బోనాలు

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 12: విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. కమాన్‌ రోడ్‌ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గాయత్రి పీఠాధిపతి నందికొండ జగద్గురు కాళహస్త్యాచార్య స్వామి హాజరై పూజలు జరిపారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఆలయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలు, భక్తి పారవశ్యంతో కోతిరాంపూర్‌ పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేయర్‌ సునీల్‌రావు బోనమెత్తుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణసంఘం బాధ్యులు వంగల రమేశ్‌, గొల్లపల్లి శ్రీనివాస్‌, శ్రీరామోజు నాగరాజు, మియాపురం బ్రహ్మం, వేములవాడ రవీంద్రాచారి, అనసూరి రమేశ్‌, ముత్తోజు రాము, లత, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

- మడేలేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో...

న్యూ దోబీవాడ మడేలేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య, కొత్తకొండ వసంత, కొత్తకొండ తార, రాచకొండ నాగరాజు, జి కుమార్‌, కె సంపత్‌, కె లక్ష్మినర్సయ్య, కె శ్రీధర్‌, కె శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T00:26:55+05:30 IST