ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: రాహుల్‌గాంధీతో తుమ్మల కీలక భేటీ.. ఖమ్మం నుంచే బరిలోకి..?

ABN, First Publish Date - 2023-10-14T15:43:31+05:30

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)తో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Election)ల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్యచరణపై చర్చించారు.

ఢిల్లీ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక (Telangana Assembly Election) ల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్యచరణపై చర్చించారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని రాహుల్‌గాంధీతో తుమ్మల చెప్పారు. సమీకరణాల రీత్యా ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని తుమ్మల అన్నారు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలల్లో ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు రాహుల్‌గాంధీతో తెలిపారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో హస్తం పార్టీ రోజురోజుకూ పుంజుకుంటోంది.

కమ్మ సామాజికవర్గం ఓట్లపై గురి

తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వడానికే రాహుల్ గాంధీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు అధికంగా ఉంటుందని.. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే తుమ్మలను ఇక్కడి నుంచి బరిలో దింపాలని రాహుల్ గాంధీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికితోడూ అధికార పార్టీ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే సామాజికవర్గం కాబట్టి.. తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయించాలని రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాంధీకి చెప్పినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో కమ్మ సామాజిక ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లుతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాజకీయాలను చక్రం తిప్పడంలో తుమ్మల సిద్ధహస్తులు. అభివృద్ధి మాంత్రికుడని తుమ్మలకు మంచి పేరుంది. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో తుమ్మల కీలక బాధ్యతలు వహించారు. ఈ రెండు పార్టీల్లోని నాయకులతో తుమ్మలకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వీరు కూడా ఈ ఎన్నికల్లో తుమ్మలకు, కాంగ్రెస్ పార్టీకి సహకరించే అవకాశాలు లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గ నేతలు అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. వీరంతా కూడా కాంగ్రెస్‌కు సహకరిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్ఠానం నమ్ముతోంది. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కూడా తుమ్మల వెంట నడుస్తామని.. ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా కూడా తుమ్మలతో పాటే నడవనున్నారు. ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు మళ్లితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-14T18:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising