వెట్టిచాకిరీ చేయిస్తే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2023-06-30T23:19:06+05:30 IST

చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సృజన హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనకు అందరు సహకరించాలని కోరారు.

వెట్టిచాకిరీ చేయిస్తే క్రిమినల్‌ కేసులు
‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎస్పీ సృజన

- ఎస్పీ సృజన

- ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పోస్టర్‌ విడుదల

గద్వాల క్రైం, జూన్‌ 30 : చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సృజన హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనకు అందరు సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఆపరేష్‌ ముస్కాన్‌-9 పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలు గొర్రెలు, పశువుల కాపరులుగా, కిరాణం, మెకానిక్‌ దుకాణాలు, హోటళ్లు, ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని, లేదంటే స్టేట్‌హోమ్‌కు పంపిస్తామని చెప్పారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టిచాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఒక ఎస్‌ఐ, నలుగురు పోలీస్‌ సిబ్బందిని నియమించి నట్లు తెలిపారు. వారితో పాటు వివిధ శాఖల అధి కారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తారని, బాలకార్మికులను గుర్తించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్నారులను పునరా వాస కేంద్రానికి పంపించే ముందు వైద్యాధికారులు వారికి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులందరూ సమష్టిగా అపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నా రు. ఒంటరి, ఉండేవారు, తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు, శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక దోపిడీలకు, హింసకు గురౌతున్న బాలలను గుర్తిస్తే, 1098 లేదా 100, ఆపరేషన్‌ ముస్కాన్‌ ఎస్‌ఐ 8712670308 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమాధికారి ముషాయిదాబేగం, సీడబ్ల్యూసీ చైర్మన్‌ సహదేవుడు, కార్మికశాఖ అఽధికారి మహేష్‌కుమార్‌, విద్యాశాఖ ఏడీ ఇందిర, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారి కృష్ణ, వైద్యాధికారి మేరమ్మ పాల్గొన్నారు.

గ్రూప్‌-4 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాల వద్ద 200 మంది పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని, కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సంబంధించి 13 రూట్లలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘాను ముమ్మరం చేశా మన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసి ఉంచాలని, చుట్టపక్కల లౌడ్‌ స్పీకర్లు పెట్టరాదని సూచించారు. కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు ప్రజలు గుమికూడొద్దని హెచ్చరించారు. అభ్యర్థులు కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని పేర్కొన్నారు. ఫొటో గుర్తింపు కార్డు ఉన్న వారినే కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. పరీక్షకు 15 నిమిషాల ముందే కేంద్రాల గేట్లు మూసి వేస్తారని, అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని పేర్కొన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌లో ఉన్న నిబంధనలను పాటించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి బ్యాగు లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, గడియారాలు, ఇతర ఎల క్ర్టానిక్‌ పరికరాలను తీసుకు రావొద్దని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Updated Date - 2023-06-30T23:19:06+05:30 IST