ఉమ్మడి జిల్లాలో ఆర్టిజన్ కార్మికుల సమ్మె పాక్షికం
ABN , First Publish Date - 2023-04-26T00:09:40+05:30 IST
డిమాండ్ల సాధనకు ఆర్టిజన్ కార్మికులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన సమ్మె మంగళవారం పాక్షికం సాగింది. తెల్లవా రుజాము నుంచే పలు ప్రాంతాల్లో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్టిజెన్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

భువనగిరి టౌన్, చౌటుప్పల్ టౌన్, మిర్యాలగూడ అర్బన్, భానుపురి, చిలుకూరు, ఏప్రిల్ 25: డిమాండ్ల సాధనకు ఆర్టిజన్ కార్మికులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన సమ్మె మంగళవారం పాక్షికం సాగింది. తెల్లవా రుజాము నుంచే పలు ప్రాంతాల్లో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్టిజెన్స్ యూనియన్ నాయకులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 308 మంది ఆర్టిజెన్ కార్మికులకు గాను 136మంది విధులకు హాజరయ్యారు. 172మంది గైర్హాజరయ్యారు. భువ నగిరిలో అదుపులోకి తీసుకున్న 60మంది కార్మికుల్లో ఇద్దరు విధుల్లో చేరేం దుకు అంగీకార పత్రం అందజేయడంతో టౌన్ ఏఈ హరినాద్, పట్టణ పోలీ స్‌స్టేషన్‌కు వచ్చి వారిని వ్యక్తిగత పూచీకత్తుపై తీసుకెళ్లారు. సమ్మె మొదటి రోజున విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఎస్‌ఈ శ్రీనాథ్ తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిలును ట్రాన్స్‌కో యాజమాన్యం విధుల నుంచి టర్మినేషన్ చేయడం ద్వారా కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడతోందని ఆ యూనియన్ జిల్లా నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్మికులను సాయంత్రానికి విడుదల చేశారు. విధులకు హాజరయ్యే వారిని ఆటంక పరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చౌటుప్పల్ మండలంలోని టీఎస్ ట్రాన్ ్సకో ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. తమ న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం వెం టనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మొత్తం 25మంది ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 11మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 139మంది కార్మికులు సమ్మెకు దూరంగా ఉండి విధులకు హాజరైనట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లలో ఆర్టిజన్ కార్మికులు తొలిరోజు పూర్తిస్థాయి విధుల్లో కొనసాగినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 65మంది విధులకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట డివిజన్ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదని విద్యుత్తు అధికారులు తెలిపారు. ఈఆర్‌వోలో ఒకరు వెళ్లినట్లు తెలిసింది. హుజూర్ నగర్ సబ్ డివిజన్‌లో 57మంది, మునగాల పరిధిలో ఏడుగురు ఆర్టిజన్ల సమ్మెకు వెళ్లారని హూజూర్‌నగర్ డివిజన్ అధికారి వెంకటకృష్ణయ్య తెలి పారు. సమ్మెకు వెళ్లిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిసి సాయం త్రం విధులకు వచ్చినట్లు సూర్యా పేట సర్కిల్ ఎస్‌ఈ పాల్‌రాజ్ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించిన తర్వాత నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సూర్యాపేట విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో ఎలాంటి సంఘ టనలు జరగకుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. చిలుకూరులో ఆర్టిజన్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.