Arvind: బీజేపీ పసుపు బోర్డు తెస్తే.. కవిత మాత్రం లిక్కర్ బోర్డు తెచ్చింది
ABN, First Publish Date - 2023-10-02T14:37:23+05:30
కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
నిజామాబాద్: ప్రధాని మోదీ (Pm modi) హయాంలో పసుపు బోర్డు రావడం శుభ పరిణామం అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు ప్రకటనతో రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రైతుల శ్రేయస్సు, సామర్థ్యాలు మనకు ముఖ్యం అని మోదీ అన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ఏమైనా చేస్తాం.. ఎంతవరకైనా వెళ్తాం అని ప్రకటించారు. పసుపు బోర్డు వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది.’’ అని తెలిపారు.
కవిత లిక్కర్ బోర్డు తెచ్చింది..
‘‘కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. కేటీఆర్ ప్రధాని గురించి మాట్లాడేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నిజామాబాద్ పార్లమెంట్ నుంచే మార్పు మొదలవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం. చాలా చోట్ల పసుపు రైతు సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఆశీర్వాద తీర్మానాలు చేస్తున్నారు. నిజామాబాద్‌లో జరిగే ప్రధాని సభకు పసుపు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాం.’’ అని అర్వింద్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-10-02T14:37:23+05:30 IST