ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Arvind: ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తాం

ABN, First Publish Date - 2023-10-26T19:00:30+05:30

గజ్వేల్‌లో మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ ఓడిపోతారని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ( MP Arvind ) అన్నారు.

నిజామాబాద్: cగురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో 7 స్థానాలు కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ హేమా హేమీలకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. కవిత ఈ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కేటీఆర్ కవితలే కారణం అవుతారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సగం మంది ఆ పార్టీలో ఉండరు. కవితపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కాపాడుతోంది. కోరుట్లలో పద్మశాలి బంధుకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కోరుట్లలో 20 శాతం పైగా ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తాను. కవిత నన్ను ఓడించడం కాదు.. వాళ్ల కార్యకర్తలే ఆమెను గత ఎన్నికల్లో ఓడించారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తాం. వ్యవసాయ సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం’’ అని ఎంపీ అరవింద్ తెలిపారు.

Updated Date - 2023-10-26T19:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising