Revanth Reddy: కవిత, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-02-09T19:09:46+05:30 IST
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ కవిత 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
ఎంపీ కవిత చర్చకు సిద్ధమా?
కేటీఆర్ రూ.5 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారు
తాను భూములు కబ్జా చేస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
ధరణి పోర్టల్ పెద్ద స్కామ్
ధరణి పోర్టల్ మీద జరిగిన దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భూములు కబ్జా చేస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెల్లాపూర్‌లో టిస్మాస్వియర్ పేరుతో ప్రతిమ శ్రీనివాస్‌రావును బెదిరించి భూములు కొనుగోలు చేశారని.. దీంట్లో కేటీఆర్ (KTR) భాగస్వామ్యం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.5 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తోట చంద్రశేఖర్‌కు 50 ఎకరాల భూమిని అప్పగించారని, మియాపూర్‌లో ఎంపీ కవిత 5 ఎకరాల ప్రభుత్వ భూమిని.. కబ్జా చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎంపీ కవిత (MP Kavitha) చర్చకు సిద్ధమా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చట్టసభల్లో లేని వ్యక్తి పేరును శాసనసభలో ఎలా ప్రస్తావిస్తారు?, ధరణి పోర్టల్ (Dharani Portal) పెద్ద స్కామ్ అని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ మీద జరిగిన దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ తెలంగాణ ప్రజాధనంతో నిర్మించిందని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కనుక అక్కడ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకు ప్రవేశం ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమ అధికారిక నివాసంలోనే ప్రజలను కలిశారు. మరి కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎంట్రీ ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంటి ? లేకపోతే ఏంటని నిలదీశారు. అందుకే తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. బిఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.