TSRTC: తెలంగాణలో అందుబాటులోకి అత్యాధునిక బస్సులు.. ఇక నుంచి ఏయే మార్గాల్లో నడుస్తాయంటే..

ABN , First Publish Date - 2023-01-04T19:43:47+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ తొలిసారిగా స్లీపర్‌ బస్‌లను అత్యాధునిక హంగులతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సులకు 'లహరి'గా నామకరణం చేశారు. మొత్తం..

TSRTC: తెలంగాణలో అందుబాటులోకి అత్యాధునిక బస్సులు.. ఇక నుంచి ఏయే మార్గాల్లో నడుస్తాయంటే..

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ (TSRTC) తొలిసారిగా స్లీపర్‌ బస్‌లను (Sleeper buses) అత్యాధునిక హంగులతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సులకు 'లహరి'గా నామకరణం చేశారు. మొత్తం పది బస్సులను హైదరాబాద్‌ నుంచి కాకినాడ, విజయవాడ మార్గాల్లో నడపనున్నారు. కొత్త బస్సులను కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద బుధవారం సాయంత్రం సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్ (Sajjanar) ప్రారంభించారు.

rtc-bus.jpg

కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. రోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి. అదేవిధంగా విజయవాడ వైపు వెళ్లే బస్సులు రోజూ మియాపూర్ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.

Updated Date - 2023-01-04T19:45:48+05:30 IST