ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TPCC Chief: మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తారా?.. కేటీఆర్‌పై రేవంత్ ఫైర్

ABN, First Publish Date - 2023-02-22T10:49:31+05:30

హైదరాబాద్‌ అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: హైదరాబాద్‌ (Hyderabad) అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ (Minister KTR)పూర్తిగా విఫలమయ్యారన్నారు. నిన్న ఐదేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే మానవత్వం లేకుండా ప్రభుత్వం (Telangana Government) వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ (Hyderabad Mayor) కుక్కలకు ఆకలేసింది అని మాట్లాడుతున్నారని... వీధికుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యలు చేశారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి (Telangana Minister) చెబుతున్నారన్నారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దుకుపుకున్నారని అన్నారు. కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం (BRS Government) ఇది అంటూ విరుచుకుపడ్డారు. కేటీఆర్ (KTR) భూపాలపల్లి పర్యటనకు ముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

ఇక్కడి ఎమ్మెల్యే భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామారావు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్‌కు అందులో వాటాలు లేకుంటే.. విచారణకు ఆదేశించాలన్నారు. నిరూపించడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వరంగల్ జిల్లా (Warangal District) ను బీఆర్‌ఎస్ (BRS) గూండాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేల (MLAs)ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy) దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగా... భూపాలపల్లి నియోజకవర్గంలో ‘‘హాత్ సే హాత్ జోడో’’ యాత్రలో భాగంగా రేగొండ మండలంలోని కొడవడంచ లక్ష్మీనరసింహస్వామిని రేవంత్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T10:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising