రైతు బిడ్డకు సీఎంఏలో 9 బంగారు పతకాలు
ABN, Publish Date - May 24 , 2024 | 07:12 AM
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
కొత్తచెరువు/పుట్టపర్తి రూరల్, మే 23: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. కోల్‌కతాలో గురువారం నిర్వహించిన ఐసీఎంఏఐ సంస్థ వార్షికోత్సవంలో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రీవ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేతుల మీదుగా 9 బంగారు పతకాలు, ఒక ప్లాటినం మెడల్, ప్రైజ్‌మనీ అందుకున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు గొల్లకేశవ, నాగేంద్రమ్మ దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈ సందర్భంగా శ్రీకాంత్ ‘ఆంధ్రజ్యోతి’తో గురువారం ఫోన్‌లో మాట్లాడారు.
భారత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సీఎంఏ పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించానని అన్నారు. దీంతో భారత ప్రభుత్వం బంగారు పతకాలతోపాటు ప్రైజ్‌మనీతో సత్కరించందని తెలిపారు. ప్రస్తుతం తాను హైదారాబాద్‌లోని ఐటీసీలో ఫైనాన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలో సత్కారం అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
Updated Date - May 24 , 2024 | 08:25 AM