Share News

ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ మురళిపై ఏసీబీ దాడులు

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:16 AM

వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది.

ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ మురళిపై ఏసీబీ దాడులు

  • ఏకకాలంలో ఆరుచోట్ల సోదాలు

  • భారీగా అక్రమాస్తుల గుర్తింపు

శ్రీకాకుళం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగి మురళీ, గత వైసీపీ పాలనలో ధర్మానసకు పీఏగా చేరిన తర్వాత ఆయన స్థాయి మారిపోయింది. 2019 నుంచి రెండున్నరేళ్లు ధర్మాన ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా వ్యవహరించిన సమయంలో మురళి హవా అంతాఇంతా కాదు. వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీల్లో ప్రత్యక్షంగానూ, శ్రీకాకుళం జిల్లా అధికారులతో నేరుగా వ్యవహారాలను నడిపే విషయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం మారడంతో మురళి బాగోతంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఏసీబీ డీఈ అతుల్‌ సింగ్‌ ఆదేశాలతో గురువారం ఆరుచోట్ల సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో మురళి ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో సోదాలు చేపట్టారు. కోటబొమ్మాళి మండలం దంత గ్రామం, బుడితి సీహెచ్‌సీ, లింగంనాయుడిపేట, శ్రీకాకుళం నగరం, విశాఖలోని గాజువాకల్లో సోదాలు నిర్వహించారు. లభ్యమైన పత్రాల ఆధారంగా ఆస్తుల విలువ రూ.3కోట్లు అని, మార్కెట్‌ రేటు దానికి పదింతలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 04:16 AM