ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ex-Information Commissioner Vijaykumar Reddy : జగన్‌ మీడియాకు దోచి పెట్టారు!

ABN, Publish Date - Dec 25 , 2024 | 03:37 AM

పత్రికల సర్క్యులేషన్‌ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..

  • సమాచార మాజీ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏసీబీ కేసు

  • ప్రకటనల రూపంలో జగన్‌ మీడియాకు వందల కోట్లు

  • బకాయిలూ ఇవ్వకుండా ఇతర మీడియాకు వేధింపులు

  • అడ్డగోలుగా వైసీపీ సోషల్‌ సైకోల నియామకం

  • అర్హతలు, ఇంటర్వ్యూలతో సంబంధం లేదు

  • ఇష్టానుసారం నియమించిన నాటి కమిషనర్‌

  • వారికి వేతనాల రూపంలో రూ.కోట్ల చెల్లింపు

  • కేసు నమోదు చేసిన గుంటూరు ఏసీబీ ఏఎస్‌పీ

అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పత్రికల సర్క్యులేషన్‌ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు.. నిబంధనలన్నీ పక్కనబెట్టి అడ్డగోలుగా జగన్‌ రోత పత్రికకు, కూలి మీడియాకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. అంతేకాదు.. జగన్‌ మీడియా, వైసీసీ సోషల్‌ మీడియాలో పనిచేసే వారిని అడ్డగోలుగా నియమించి అధిక వేతనాలు కట్టబెట్టారు. ఆయనే నాటి సమాచార-పౌరసంబంధాల కమిషనర్‌ తుమ్మా విజయకుమార్‌రెడ్డి. ఆయన నిర్వాకాలపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. అక్రమాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను కూటమి సర్కారు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ డీజీ.. గుంటూరు ఏసీబీ ఏఎస్‌పీ మహేంద్రకు ఉత్తర్వులిచ్చారు. విచారణ అనంతరం విజయ్‌కుమార్‌ రెడ్డి, గుర్తుతెలియని వ్యక్తులపై మహేంద్ర కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆయన క్విడ్‌ ప్రొ కో, అవినీతి, బంధుప్రీతి, అవకతవకలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌(క్రైం నంబర్‌ 7/ఆర్‌సీవో-ఏసీబీ-జీఎన్‌టీ/2024)లో ఆరోపించారు. ఆయనపై ఐపీసీ 120బీ, అవి నీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 13(2) రెడ్‌ విత్‌ 13 (1ఏ) లను మోపారు. విజయకుమార్‌రెడ్డిపై ఆరోపణలివీ..


అర్హతలతో పనిలేకుండా..

జగన్‌ రోత మీడియాలో పనిచేసే వారిని అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఐ అండ్‌ పీఆర్‌లో వివిధ పోస్టుల్లో నియమించారు. 142 పోస్టుల భర్తీకి విజయకుమార్‌రెడ్డి ప్రతిపాదనలు పంపారు. వారిలో పీఆర్‌వోలుగా 50 మందిని, ఫొటోగ్రాఫర్లు-15, వీడియోగ్రాఫర్లు-15, ఇన్ఫర్మేషన్‌ టెక్నీషియన్లు-30, డేటా ఎంట్రీ ఆపరేటర్లు-15, ఆఫీసు సబార్డినేట్లు-10, డ్రైవర్లు-10, సీఎంవో ఆఫీసులో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. అవుట్‌సోర్సింగ్‌ నియామకాల ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాల్సి ఉండగా అలా చేయలేదు. 2019 డిసెంబరు 1కే కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిపోయిన కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఏజెన్సీని 2020 జూలై వరకు పొడిగించారు. తద్వారా 2016లో విడుదలైన జీవో 151ని విజయకుమార్‌రెడ్డి ఉల్లంఘించారు. అంతేకాదు.. ఈ నియామకాల్లో రిజర్వేషన్‌ నిబంధనలను పాటించలేదు. అడ్డగోలుగా నియామకాలు జరిపేశారు. ఖాళీ అయిన పోస్టులను కాంట్రాక్టు సంస్థ ద్వారా భర్తీ చేయాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం.. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలి.ఈ నియామక ప్రక్రియ మొత్తం అదే చూసుకోవాలి. అయితే విజయకుమార్‌రెడ్డే ఈ నియామకాలన్నీ చేపట్టారు. ఏజెన్సీ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కామేశ్వర్‌ప్రసాద్‌ను పిలిపించి.. నియామక ప్రక్రియలో ఆ సంస్థ జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని.. వారిని తామే ఎంపిక చేసి పేర్లు పంపుతామని.. వారి పేర్లతో నియామక పత్రాలు పంపాలని స్పష్టం చేశారు. 2019-20 మధ్య వివిధ తేదీల్లో 142 మంది పేర్లను వివిధ పోస్టులకు పంపి.. వారి పేర్లు, హోదాలతో అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇప్పించారు. విజయకుమార్‌రెడ్డి, డిజిటల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి ఆదేశాలతో ఈ నియామకాలు చేపట్టారు. వీరిలో అత్యధికులు సాక్షి మీడియాలో పనిచేస్తున్నవారే. వారి సర్టిఫికెట్లను పరిశీలించలేదు.


చాలా మంది రెజ్యూమ్‌లు ఏజెన్సీ వద్ద గానీ, ఐ అండ్‌ పీఆర్‌ వద్ద గానీ లేవు. మరో 113 మంది వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను, సాక్షి సిబ్బందిని అక్రమంగా కంటెంట్‌ డెవలపర్స్‌, సోషల్‌ మీడియా అనలిస్టులు, డిజిటల్‌ క్యాంపెయినర్స్‌ లాంటి పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కోస్‌) ద్వారా నియమించారు. అలాగే విజయకుమార్‌రెడ్డి నిబంధనలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా సాక్షి మీడియాకు వందల కోట్లు చెల్లించారు. 2019-24 నడుమ ఎలకా్ట్రనిక్‌ మీడియాకు మొత్తం 26.718 కోట్ల ప్రకటనలు ఇవ్వగా.. ఇందులో సాక్షి, టీవీ9, ఎన్‌టీవీకి 16.179 కోట్లు చెల్లించారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాటీవీకి అసలు ప్రకటనలే ఇవ్వలేదు. ఈ చానళ్ల పెండింగ్‌ బకాయిలను క్లియర్‌ చేయకుండా వేధించారు. సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ బకాయిలను మాత్రమే క్లియర్‌ చేశారు. ప్రింట్‌ మీడియాకు క్లాసిఫైడ్‌, డిస్‌ప్లే ప్రకటనల కింద 2019-24 నడుమ ప్రభుత్వం మొత్తం రూ.859.298 కోట్లు విడుదల చేయగా.. ఇందులో 43 శాతం అంటే.. రూ.371.124 కోట్లు ఒక్క సాక్షి మీడియాకే ఇచ్చారు. అలాగే ప్రకటనల రేటు పెంచాలని సాక్షి మీడియా కోరడం ఆలస్యం.. అడ్డగోలుగా పెంచేశారు. ఆ సంస్థ అడిగినదానికంటే ఎక్కువే పెంచారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం తమ పేపర్లో ప్రకటనకు సెంటీమీటరు రూ.2,626కి పెంచాలని అడిగితే.. విజయకుమార్‌రెడ్డి ఏకంగా.. రూ.2,917కి పెంచారు. అంటే రూ.291 అదనంగా ఇచ్చేశారు. తద్వారా 2021-24 నడుమ జగన్‌ పత్రికకు రూ.19.63 కోట్లు అధికంగా ఇచ్చారు.నాటి కమిషనర్‌ అధికార దుర్వినియోగంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.

Updated Date - Dec 25 , 2024 | 03:37 AM