ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్

ABN, Publish Date - Sep 08 , 2024 | 09:01 AM

బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..!

Budameru

అమరావతి: బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..! దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు మూడు గండ్లు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు థాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గండ్లను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి.. నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పులివాగు వరద థాటికి ముగ్గురు ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు.


టెన్షన్.. టెన్షన్

అసలే వరద భయంతో బిక్కు బిక్కు మంటున్న విజయవాడ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.


మిగిలిన చోట్ల ఇలా..

కాగా.. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం మళ్లీ పెరిగింది. బ్యారేజి వద్ద 3, 82, 662 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పులిచింతల, సాగర్ నుంచి పెరిగిన వరద నీరు విడుదల చేయడం జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి దిగువన నదీతీర గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతవాసులను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్ర తీరం ఉంది. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Updated Date - Sep 08 , 2024 | 09:07 AM

Advertising
Advertising