Amaravati : అదానీ పోర్ట్సు సాయం 25 కోట్లు
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:59 AM
వరద బాధితుల కోసం అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఆ దాతల్ని సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందించారు.
సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ.. ఏపీఎండీసీ 5 కోట్లు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు చెక్కుల అందజేత
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వరద బాధితుల కోసం అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఆ దాతల్ని సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందించారు. అదానీ పోర్ట్స్ ఎండీ కిరణ్ అదానీ రూ.25 కోట్లు, ఏపీ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ రూ.5 కోట్లు, శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు, నాయకుల తరఫున ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి రూ.2,22,70,749, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ సెంటర్ తరఫున రూ.కోటీ 10 వేల 116 అందించారు.
పశ్చిమ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.కోటీ 116, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ తరఫున కె.ప్రతా్‌పరెడ్డి రూ.60 లక్షలు, పాణ్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల తరఫున ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రూ.30 లక్షలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తల తరఫున ఇన్‌చార్జి వలవల బాబ్జీ రూ.30 లక్షలు, స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ కేఎస్ రామచంద్రరావు రూ.20 లక్షలు, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు జీఎన్‌బీ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం రూ.14,41,348, అచ్యుతాపురం ఇండస్ర్టీస్ అసోసియేషన్ తరఫున పి.నారాయణరాజు రూ.10.78 లక్షలు, ఎస్పీ కిరణ్‌కుమార్ రూ.10 లక్షలు, డాక్టర్ వైభవ్‌చంద్ రూ.10 లక్షలు, కానూరి నరసింహారావు రూ.7.50 లక్షలు, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రూ.7 లక్షలు, నెల్లూరు జిల్లా కమ్మజన సంక్షేమ సమితి రూ.5 లక్షలు, డాక్టర్ నెల్లూరి రమేష్ రూ.5 లక్షలు, దుర్గా సారథి రూ.5 లక్షలు, దొడ్డా చిన్నబాలాజీ రూ.5 లక్షలు, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్స్ రూ.5 లక్షలు అందజేశారు.
టెక్స్‌టైల్స్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా రూ.30 లక్షలు, ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు, శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకుడు వి.సతీష్ రూ.10 లక్షలు, జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, సాయి రమ సివిల్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత గోవిందరావు రూ.5 లక్షలు, ఎస్ పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం శేషావలి రూ.3 లక్షలు ఇచ్చారు.
మంత్రి లోకేశ్‌ను కలిసిన కరణ్ అదానీ
అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ గురువారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.