ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఏకపక్ష సర్దుబాటుపై అధ్యాపకుల్లో ఆవేదన

ABN, Publish Date - Aug 16 , 2024 | 06:28 AM

ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియపై డిగ్రీ లెక్చరర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పనిలేకుండా అవసరమైన సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపండంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సుదూర ప్రాంతాలకు పంపడంపై డిగ్రీ లెక్చరర్ల అభ్యంతరం

  • ఖాళీలను పారదర్శకంగా ప్రకటించి ఎంపికకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియపై డిగ్రీ లెక్చరర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పనిలేకుండా అవసరమైన సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపండంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న సర్దుబాటు విధానంలో టీచర్ల అభిప్రాయానికి విలువ ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఖాళీలు ఎక్కడున్నాయి? అవసరం ఎక్కడుంది? అన్న విషయాలను పారదర్శకంగా చూపించి, ఆప్షన్‌ ఇస్తే సముచితంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు కక్షసాధింపు చర్యగానే భావించాల్సి వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.

380 కి.మీ. ఆవల సర్దుబాటా!

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మరోసారి పని సర్దుబాటు చేపట్టాలని ఆ శాఖ నిర్ణయించింది. తాజాగా జోన్‌-3లో తొమ్మిది మంది లెక్చరర్లను సర్దుబాటు పేరుతో నాగార్జున సాగర్‌లోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీకి పంపారు. నెల్లూరు నుంచి 381 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి ఏకపక్షంగా పంపడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొన్ని కాలేజీల్లో లెక్చరర్లు మిగిలగా, కొన్నిట్లో అవసరం ఏర్పడింది. అవసరం మేరకు ఆర్జేడీలు జాబితాలు తయారు చేస్తున్నారు. వాటి ఆధారంగా మరోసారి సర్దుబాటు తప్పదు.

అయితే తమను అధికారులు ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారన్నది అధ్యాపకుల ఆరోపణ. తరచూ రకరకాల శిక్షణలతో పేరుతో దూర ప్రాంతాలకు పంపుతున్నారని, దీంతో బోధన సమయం తగ్గిపోతోందని అంటున్నారు. దీనిపై ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్సీలకు వారు ఫిర్యాదు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తమపై వేధింపులు ఇంకా పెంచారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు సర్దుబాటు పేరుతో పంపితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు సమయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న సర్దుబాటు పద్ధతిని వారు చూపిస్తున్నారు.


  • అసలు సర్దుబాటు ఎందుకు?

డిగ్రీ కాలేజీల్లో సింగిల్‌ మేజర్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత లెక్చరర్ల అవసరం గందరగోళంగా మారింది. ఈ విధానంలో ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు లెక్చరర్లు కావాలి. దీంతో కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులను ఎత్తివేశారు. ఆ కారణంగా కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు మిగులుగా మారారు.

వారిని అవసరమైన చోటకు సర్దుబాటు పేరుతో పంపుతున్నారు. అందులో భాగంగానే కళాశాల విద్యాశాఖ ఈ ఏడాది జనవరిలో 140 మందిని సర్దుబాటు పేరుతో ఇతర కాలేజీలకు పంపింది. జనవరిలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటుపై వెళ్లిన అధ్యాపకులు ఏప్రిల్‌ తరువాత తిరిగి సొంత కళాశాలలకు వచ్చేయాలి. కానీ వారిని అనధికారికంగా ఇప్పటికీ అక్కడే కొనసాగిస్తున్నారు. పాత కాలేజీల్లో వారి అవసరం లేదని, అందువల్లే కొనసాగిస్తున్నామని చెబుతున్న అధికారులు... వారి కొనసాగింపుపై ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు.

Updated Date - Aug 16 , 2024 | 06:42 AM

Advertising
Advertising
<