ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD : టీటీడీలో ధర్మారెడ్డి, భూమన అక్రమాలు

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:50 AM

గత ప్రభుత్వ పాలనలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి భారీగా అక్రమాలకు తెగబడ్డారని, వారిపై సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపి....

  • సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ చేపట్టాలి

  • బడ్జెట్‌ పరిమితిని భారీగా పెంచి అవినీతి

  • శ్రీవాణి టికెట్ల సొమ్ము ఎలా ఖర్చు చేశారో లెక్కల్లేవు

  • గెస్ట్‌హౌ్‌సలకు భూముల కేటాయింపుల్లో

  • సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన

  • సీఎ్‌సకు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పాలనలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి భారీగా అక్రమాలకు తెగబడ్డారని, వారిపై సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్‌ అధికారికి కాకుండా ధర్మారెడ్డిని జేఈఓగా, తర్వాత ఈఓగా జగన్‌ ప్రభుత్వం నియమించిందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిఽధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ సీఎ్‌సను కలిసి వివరించారు. తిరుమలలో గెస్ట్‌హౌ్‌సలకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్నారు.

ఫర్నిచర్ల మార్పు పేరుతో రూ.కోట్లు పక్కదారి పట్టించారని, భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా... జగన్‌పై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులు, వైసీపీ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తుండేవారని పేర్కొన్నారు. ధర్మారెడ్డి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే క్రిమినల్‌ కేసుల్లో జగన్‌ను కాపాడేందుకు ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమయ్యాయని తెలిపారు. రూ.2 కోట్ల విలువ గల డైమండ్‌ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్‌ చేశారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయని గుర్తు చేశారు. బడ్జెట్‌ పరిమితిని అధిగమించి మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రూ.475 కోట్లకు పెంచగా.. అనంతరం చైర్మన్‌ అయిన కరుణాకర్‌రెడ్డి భారీగా రూ.1772 కోట్లకు పెంచి అక్రమాలకు పాల్పడ్డారన్నారు.


శ్రీవాణి టికెట్లు పేరుతో రూ.10,500 వసూలు చేసి, ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదన్నారు. ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్‌ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పనైనా చేసుకునేలా అవకాశం కల్పించారని తెలిపారు. పద్మావతి ఆసుపత్రి, బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌, స్విమ్స్‌ కార్డియో న్యూరో బ్లాక్‌ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

ఆసుపత్రుల నిర్మాణానికి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారన్నారు. రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో అనుమతుల కోసం టీటీడీ కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. వైసీపీ హయాంలో తిరుమలలో గెస్ట్‌హౌ్‌సల నిర్మాణం, విరాళాలు, వ్యక్తిగత దాతల విషయాల్లో టీటీడీ పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంబించిందని చెప్పారు. తిరుమల కాంప్లెక్స్‌ 5 నిర్మాణంలో రూ.98కోట్లు కమీషన్ల రూపంలో పక్కదారిపట్టాయన్నారు. వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలో సలహాదారులుగా, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారని వివరించారు.

Updated Date - Jul 09 , 2024 | 10:44 AM

Advertising
Advertising
<