Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై అంజనమ్మ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ABN, Publish Date - Oct 01 , 2024 | 08:28 PM
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1990వ దశకం మధ్యలో ఎవరీ అబ్బాయి అంటూ కొన్ని వాల్ పోసర్లు రాత్రికి రాత్రి వేలిశాయి. ఎవరు ఇతడు అనుకునే క్రమంలో కొద్ది రోజులకు ఇతడి పేరు పవన్ కల్యాణ్. మెగా బ్రదర్స్‌లో ఒకడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వాల్ పోస్టర్లలో క్లారిటీ ఇచ్చారు. మరికొన్ని రోజులకు ఆ సినిమా విడుదలైంది. బొమ్మ హిట్ కొట్టింది.
Also Read: Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..
Also Read: Durga Navaratri 2024: శరన్నవ రాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం
ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చిత్రాలు వరుసగా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. అనంతరం పవన్ కల్యాణ్ నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలవడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. దీంతో ఆయన ఏ చిత్రంలో నటిస్తే.. ఈ చిత్రం వెండి తెర మీద వెలిగిపోతుందనే నమ్మకం అటు టాలీవుడ్ పరిశ్రమలోని పెద్దలకే కాదు.. ప్రజల్లో సైతం కలిగింది. దీంతో పవన్ కల్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ కాస్తా యాడ్ అయింది. అంతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌గా మారిపోయారు.
Also Read: West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు
మరోవైపు జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచి.. వైసీపీ అధికారాన్ని దక్కించుకుంది. ఆ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ వైఖరిపై తనదైన శైలిలో నిరసన గళాన్ని సైతం వినిపించారు.
Also Read: గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా..
అక్కడితో అగలేదు.. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో బాధితులుగా మారిన రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలిచారు. వారికి బాసటగా ఆందోళనలో సైతం పాల్గొన్నారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి.. బరిలోకి దిగాయి. ఆ క్రమంలో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ బరిలో నిలిచి గెలిచారు.
Also Read: Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..
అంతేకాదు.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులు బరిలో దిగితే.. వారంతా విజయం సాధించారు. ఈ గెలుపు ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్‌లో మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు.
అలాంటి వేళ... జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనమ్మ తొలిసారిగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమ్మ మనస్సు పేరుతో విడుదల చేస్తున్న ఈ వీడియో త్వరలో ప్రజల ముందుకు రానుంది. ఈ వీడియోకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ మంగళవారం విడుదల చేసింది.
ఈ వీడియోలో అంజనమ్మ పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో పవన్ కల్యాణ్ ఎలా ఉండేవాడు. గత ప్రభుత్వ హయాంలో రహదారిపై పవన్ కల్యాణ్ పొడుకుని నిరసన తెలియజేసిన సమయంలో ఆ కన్నతల్లి మనస్సు ఏ విధంగా తల్లడిల్లిందనే విషయాలను ఈ అమ్మ మనస్సు వీడియోలో అంజనమ్మ సోదాహరణగా వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తలు కోసం..
Updated Date - Oct 01 , 2024 | 08:37 PM