ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోకేష్, అనితలపై వర్షించిన ‘అమ్మణ్ణి’ సౌందర్యం.. కొర్రపాటి, పురాణపండలకు ప్రశంసలు

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:38 AM

వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్‌కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.

అమరావతి: మహా నాగరికతలు, సాంకేతిక అంశాలు పెరిగి నానాటికీ జీవితంలో అధిక భాగం మొబైల్ ఫోన్ లో, యు ట్యూబ్ కో , పేస్ బుక్ కో అంకితమైన ఈ కాలంలో …. పుస్తకాలు చదవడం తక్కువైన ఈ కాలంలో కూడా పురాణపండ శ్రీనివాస్ అనబడే ఒకే ఒక వ్యక్తి అప్రతిహత శక్తికి ఆవిష్కృతమవుతున్న అద్భుత గ్రంధాలకు తెలుగు రాష్ట్రాలలో అనూహ్య ఆదరణ లభిస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దశాబ్దకాలంగా తెలుగు రాష్ట్రాలలో అనేక ఆలయాల్లో, అర్చకుల చేతుల్లో, వేదపాఠశాలల్లో , అనేకమంది పారిశ్రామికవేత్తల గృహాల్లో, రాజకీయనేతల చేతుల్లో, ఎంతోమంది సినీప్రముఖుల పూజా పీఠాల్లో ఈ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఒక్కొక్క బుక్కు ఒక్కొక్క విలక్షణ పేరుతో అత్యంత సౌందర్యంగా దర్శనమిస్తోంది.

భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ ... ఇలా విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయనేతలు మాత్రమే కాకుండా ఎందరో తెలుగు చలన చిత్ర ప్రముఖులు సైతం శ్రీనివాస్ బుక్స్ కి స్పాన్సర్స్ గా వ్యవహరించడం మనకన్నులముందు కనిపిస్తున్న సత్యం. ముద్రణా సౌందర్యం భాషాసౌందర్యం, పుస్తక సౌందర్యం అదిరిపోతోందని భాషావేత్తలు నుంచి భక్త పాఠకుల వరకూ ఈ పవిత్ర గ్రంధాలకు నీరాజనాలివ్వడం వల్లనే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన సందర్భంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల సౌజన్యంతో వివిధ దేవస్థానాలకు చేరిన దివ్య గ్రంధాలు వందలాది భక్తులను ఆకర్షిస్తున్నాయి.

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలకు భక్తసమాజంలో వున్న అసాధారణ స్పందనకు ఈ ఆలయ వర్గాలు సైతం భారీగానే స్పందించి ఆలయాలకు విచ్చేస్తున్న ప్రముఖులకు దేవతా జ్ఞాపిక, దుశ్శాలువతో పాటు ఎంతో సౌందర్యవంతంగా, వేదిక్ కంటెంట్ తో అపూర్వంగా ముద్రించబడిన పురాణపండ దివ్య గ్రంధాన్ని కూడా బహూకరించడంతో అతిధులు దైవానుగ్రహంగా భావించి ఆనందాన్ని వ్యక్తం చెయ్యడం గమనార్హం. ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత , 'ఈగ - లెజెండ్ ' వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం 'అమ్మణ్ణి' గ్రంధాన్నిఆంధ్ర ప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్ కు , ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖామంత్రి శ్రీమతి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం.


ఈ మహా గ్రంథ నిర్మాణం, నాణ్యత, అపురూపపు అంశాలు, స్తోత్రాలు సంకలనం, అక్కడక్కడా వ్యాఖ్యాన వైఖరీదక్షత పురాణపండ శ్రీనివాస్ భాషా పటిమ గురించి …. మొత్తంగా అద్భుతః అని తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యాధికులు కొందరు అక్కడే ప్రశంసలు వర్షిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటి కి హిందూపూర్ శాసన సభ్యులు ప్రముఖకథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని బాలకృష్ణ సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, శ్రీమతి భువనేశ్వరి ... నారా లోకేష్ , శ్రీమతి బ్రాహ్మణి దంపతుల వర్ణ చిత్రాలతో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి పవిత్ర విశేషాలతో కర్ణాటకలోని బళ్లారి శ్రీ అమృతేశ్వరాలయం సమర్పించిన ' స్మరామి .. స్మరామి ' గ్రంధాలు అమరావతి కరకట్టలోని ముఖ్యమంత్రి నివాసానికి మూడురోజులముందే చేరాయి. ఈ గ్రంధాలకు కూడా రచనా సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్ కావడం ఆసక్తిదాయకం. శ్రీ అమృతేశ్వరుని ఆలయాన్ని సాయి కొర్రపాటి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మహాద్భుతంగా నిర్మించినట్లు , ఇది దక్షిణ భారతదేశంలోనే అతి అరుదైన ఆలయమని విశ్లేషకులు సాయి కొర్రపాటిపై ప్రశంసలు వర్షిస్తున్నారు.

సుమారు వందమంది అమ్మవార్ల అరుదైన చిత్రాలతో , మంత్ర విద్యల ఉపాసనలతో పరమ ఉత్తమంగా పురాణపండ అపూర్వంగా రూపు దిద్దిన ఈ అమ్మణ్ణి గ్రంధంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , భువనేశ్వరి దంపతులకు వారాహి అనుగ్రహం వర్షించే అంశాలను మొదటి పేజీల్లో వారాహి చలన చిత్రం ప్రచురించి తెలుగు దేశం వర్గాలను అమితంగా ఆకర్షించారు. మరొక ప్రక్క గత నాల్గు రోజులుగా బెజవాడ కనదుర్గమ్మ దర్శనార్ధం వస్తున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అడిషినల్ కమీషనర్ కె.ఎస్. రామారావు ' జయ జయోస్తు ', ' నారసింహో ... ఉగ్రసింహో ' వంటి మహోన్నత పవిత్రతల శక్తీ సంపన్న గ్రంధాలను అక్షర ప్రసాదంగా అందిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 07:58 PM

Advertising
Advertising