KGBV EMPLOYEES : 40రోజుల ఉద్యోగం..!
ABN, Publish Date - May 03 , 2024 | 01:17 AM
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....
కేజీబీవీ ఉద్యోగులతో ఆటలు
జగన ప్రభుత్వ తీరుపై విమర్శలు
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
- అనంతపురం విద్య
కొత్త ఉత్తర్వుల మంటలు
జగన ప్రభుత్వం కొత్త ఉత్తర్వుల పేరిట ఉద్యోగులతో ఆడుకుంటోంది. సమగ్రశిక్ష ప్రాజెక్టు కింద పనిచేసే వేలాది మంది ఉద్యోగులను ఏటా ఏప్రిల్ 29న ఉద్యోగాల నుంచి తొలగించి, 30వ తేదీ గ్యాప్ ఇచ్చి మే 1వ తేదీ నుంచి రెన్యువల్ చేసేవారు. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను ఏడాది కాలానికి రెన్యువల్ చేసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రశిక్ష పరిధిలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తించేవి. అయితే ఈ ఏడాది కొత్తగా 40 రోజుల ఉత్తర్వులు తేవడం విమర్శలకు తావిస్తోంది. కేజీబీవీల్లో పనిచేసే ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలకు మాత్రమే 2024-25 విద్యా ఏడాదికి 40 రోజుల గడువుతో రెన్యువల్ ఉత్తర్వులిచ్చారు. మే 1 నుం చి జూన 9వ తేదీ వరకూ 40 రోజులకు మాత్రమే ఆ కేటగిరీ ఉద్యోగులను రెన్యువల్ చేశారు.
ఈ మాత్రానికే..
రెన్యువల్ అగ్రిమెంట్లకు ఏటా రూ.100 బాండ్ల మీద ఉద్యోగులు రాసిచ్చేవారు. ఏడాది కాలానికి సరిపోయే రెన్యువల్ అది. కానీ ఈసారి కేవలం 40 రోజులకు రెన్యువల్ చేసినా.. జిల్ల సమగ్రశిక్ష అధికారులు బాండ్ అడుగుతున్నారు. అగ్రిమెంట్ కోసం ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఎవరూ అడగకపోయినా.. అనంతలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వెంటనే బాండ్ పేపర్లు ఇవ్వాలని, అప్పుడే జీతాలు బిల్లులు పెడతామని అంటున్నారు.
ఏడాదికి ఇవ్వాలి..
కేజీబీవీ ఉద్యోగులకు ఎప్పటిలాగా ఒక రోజు విరామంతో ఏడాదికి రెన్యువల్ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులు 40 రోజుల బాండ్ అగ్రిమెంట్ ఇవ్వమని ప్రాజెక్టు అధికారులు బెదిరింపులకు దిగడం సరికాదు. ఏ ప్రభుత్వ శాఖలో ఎప్పుడూ లేనివిధంగా కేజీబీవీ ఉద్యోగులకు 40 రోజుల డెడ్‌లైనతో ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయం. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మునుపటిలాగా ఏడాది కాలానికి ఉత్తర్వులివ్వాలి.
- విజయ్, సమగ్రశిక్ష, కేజీబీవీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 03 , 2024 | 01:17 AM