AP News: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫ్‌ర్‌పై దాడిని ఖండిస్తూ అనంతలో ఏపీయూడబ్ల్యూజే ఆందోళన
ABN, Publish Date - Feb 19 , 2024 | 11:22 AM
Andhrapradesh: అనంతలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసనకు దిగారు.
అనంతపురం, ఫిబ్రవరి 19: అనంతలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసనకు దిగారు. రౌడీ మూఖలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ముట్టడికి జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు యత్నించారు. ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా సీపీఐ నేతలు చేరుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2024 | 11:27 AM