MUNCIPAL CHAIRMAN: సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:08 AM
సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్ చైర్మన డీఈ రమే్‌షకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు.

హిందూపురం అర్బన, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్ చైర్మన డీఈ రమే్‌షకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వివేకనంద జీవిత చరిత్ర పుస్తకాలు అందించారు. ప్రిన్సిపాల్ హరిప్రసాద్, కురుబ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ పరిమళ, అధ్యాపకులు శ్రీనివాసులు, హిమబిందు పాల్గొన్నారు.
సరుకుల పంపిణీ: రంజాన మాసాన్ని పురస్కరించుకుని 32వ వార్డు కౌన్సిలర్ రేష్మ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను చైర్మన రమేష్ చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం వార్డులో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందు కలుగకుండా శుభ్రం చేస్తున్నారని అభినందించారు. 30 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందించారు.