EX MLC GUNDUMALA : రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:06 AM
నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.

మడకశిరటౌన, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్‌యార్డును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఓవర్‌హెడ్ ట్యాంకుల పనులు కొంత వరకు చేశారని, అధికారంలోకి వచ్చిన వైసీపీ అవసరం లేకున్నా పనులు చేసే సమయంలో పైపులు కొనుగోలు చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా కమీషన్ల కోసం కక్కుర్తిపడి పైపులు కొనుగోలు చేసి మార్కెట్‌యార్డులో నాలుగు సంవత్సరాల క్రితం నిల్వ చేశారని అన్నారు. శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2.04కోట్ల విలువచేసే పైపులు బుగ్గిపాలు కావడానికి గత ప్రభుత్వ పాలకులే కారణం అని ఆరోపించారు. మార్కెట్‌యార్డు అధికారులు పుట్టపర్తి ఏడీఎం నరసింహమూర్తి, డీఈఈ ఎస్.రఘునాథ్ పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ: పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రాఘవేంద్రస్వామి నూతన ఆలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో ఆదివారం టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి భూమిపూజ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి రంగేగౌడ్, డాక్టర్స్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, మీడియా కోఆర్డినేటర్ రవికుమార్ పాల్గొన్నారు.