ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP MANIFESTO : కూటమి మేనిఫెస్టో కేక

ABN, Publish Date - May 01 , 2024 | 01:02 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోతో వైసీపీ డీలా పడింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇనచార్జి సిద్దార్థ్‌సింగ్‌ సమష్టిగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలో ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ తరువాత గంట వ్యవధిలోనే కూటమి మేనిఫెస్టో అంశాలపై ఎక్కడ చూసినా చర్చ జరిగింది. నలుగురు కలిసిన చోటల్లా దీని గురించే మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలు సైతం ప్రధానంగా చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు.. ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు ...

అన్ని వర్గాలలో హర్షాతిరేకాలు ..

డీలా పడిన వైసీపీ అభ్యర్థులు..

కూటమి అభ్యర్థుల్లో కదనోత్సాహం

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోతో వైసీపీ డీలా పడింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇనచార్జి సిద్దార్థ్‌సింగ్‌ సమష్టిగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలో ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ తరువాత గంట వ్యవధిలోనే కూటమి మేనిఫెస్టో అంశాలపై ఎక్కడ చూసినా చర్చ జరిగింది. నలుగురు కలిసిన చోటల్లా దీని గురించే మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలు సైతం ప్రధానంగా చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు.. ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేలా మేనిఫెస్టో ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంభనకు మేనిఫెస్టో రాచబాట అని ఆ వర్గాలు అంటున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యం కల్పించారని హర్షం వ్యక్తమౌతోంది. భూ యజమానులకు గుదిబండగా మారిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను కూటమి అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గాలన్నీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం


మిషన రాయలసీమకు హామీ

రాయలసీమ అంటేనే కరువు కాటకాలకు నిలయం. ఇక్కడ రైతాంగానికి వ్యవసాయమే జీవనాధారం. సీమ రైతు బాధలను, ఇక్కడి పరిస్థితులను యువగళం పాదయాత్రలో కళ్లారా చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ, తన పాదయాత్రలోనే మిషన రాయలసీమ పేరుతో రాయలసీమ జిల్లాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను కూటమి మేనిఫెస్టోలో నారా లోకేశ నిలబెట్టుకున్నారు. మిషన రాయలసీమ అమలుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో స్పష్టం చేయడం ఈ ప్రాంత ప్రజలకు మరింత ఊరటనిచ్చినట్లయింది. సూపిర్‌సిక్స్‌ పథకాల మేనిపెస్టో.. కూటమి అభ్యర్థుల్లో కదనోత్సాహాన్ని నింపుతోంది. వైసీపీ అభ్యర్థులు డీలా పడేలా చేసింది.

ఇపుడెలా..?

కూటమి మేనిఫెస్టోతో వైసీపీ అభ్యర్థులు డోలాయమానంలో పడ్డారు. సీఎం జగన విడుదల చేసిన మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందంగా... అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడమే కాకుండా, ఆర్థిక చేయూతనిచ్చే విధంగా కూటమి మేనిఫెస్టో ఉండటం ఆ పార్టీ అభ్యర్థులను మరింత కుంగదీస్తోంది. నియోజకవర్గానికి ఐదేళ్ల పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నామనేదేగాని, మొత్తం వ్యవహారమంతా సీఎం బటన నొక్కుడుతోనే సరిపోయిందన్న వేదన ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ప్రజలు ఆశించిన స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బటన నొక్కుడు పథకాలకంటే... కూటమి మేనిఫెస్టోనే బేషుగ్గా ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇది వైసీపీ అభ్యర్థులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.


కదనోత్సాహం..

కూటమి మేనిఫెస్టో ఆ పార్టీ అభ్యర్థుల్లో కదనోత్సాహాన్ని నింపుతోంది. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనపై విసిగివేసారిన అధికార పార్టీలోని బడుగు, బలహీన వర్గాలతో పాటు.. అధికార పార్టీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వలస వెళుతున్నారు. ఇది కూటమి అభ్యర్థులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూల స్పందన, వైసీపీ నుంచి వలసల జోరు కూటమి అభ్యర్థుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పరిణామాలతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ అభ్యర్థుల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులను ఎండగడుతూనే... సూపర్‌ సిక్స్‌ పథకాల లబ్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలలో మరింత చైతన్యాన్ని నింపి, విజయానికి బాటలు వేసుకుంటున్నారు.

మహిళలు.. మహా రాణులు

ప్రజాగళం పేరుతో కూటమి అధినేతలు విడుదల చేసిన మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలు కూటమికి అధికారం కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలలో వ్యక్తమౌతోంది. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనందించే విధంగా మేనిఫెస్టో రూపొందించారని మేధావులు అంటున్నారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పడం, రూ.10 లక్షల వరకూ వడ్డీలేని డ్వాక్రా రుణాలు.. ఇలా మహిళల ఆర్థిక స్వావలంభనకు పెద్ద పీట వేశారు. తద్వారా ఆ వర్గాలన్నీ కూటమికి మరింత దగ్గరయ్యాయి.


అన్నదాతకు చేయూత

రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం అన్నదాతలలో ఆశలు చిగురించేలా చేసింది. కరువు రైతుకు పెట్టుబడి సాయంతో పాటు... డ్రిప్‌, స్ర్పింక్లర్లు 90 శాతం సబ్సిడీతో ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రతి సభలో చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలోనూ ఒక అంశంగా చేర్చారు. నిరుద్యోగ యువతలో భరోసా నింపారు.

ఎయిడెడ్‌.. ఊపిరి

ఎయిడెడ్‌ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇది ఆ విద్యాసంస్థలకు జీవం పోస్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగిస్తారని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా.. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు వలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనంగా ఇస్తామని చెప్పారు. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ అంశాలన్నీ కూటమి అధికారంలోకి రావడానికి దోహదపడతాయని అభ్యర్థులు దీమా వ్యక్తం చేస్తున్నారు.


బీసీల పార్టీ

తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. ఆ వర్గాల రక్షణకు ప్రత్యేక చట్టంతో పాటు ఆర్థికంగా చేయూతనందిచేందుకు ఐదేళ్లల్లో రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన అమలు, బీసీల స్వయం ఉపాధికి ఏడాది రూ.10 వేల కోట్లు, ఆదరణ కింద మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన అమలు చేస్తామన్నారు. ఇవి ఆ వర్గాల అభ్యున్నతికి మరింత దోహదపడతాయి. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు, రజకుల కోసం దోభీఘాట్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత, వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు, ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.2 వేలు గౌరవ వేతనం, స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన, మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థికసాయం, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లకు రూ.10 లక్షలు రాయితీ, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, ఆర్యవైశ్య కార్పొరేషనకు నిధుల కేటాయింపు, ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరీ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం.. ఇవన్నీ ఆయా వర్గాలను టీడీపీకి మరింత చేరువ చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.


ప్రధాన హామీలు

- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

- దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు

- యువతకు 20 లక్షల ఉద్యోగాలు

- నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి

- తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు (కుటుంబంలో ఎంత మందికి ఉంటే అంత మందికి)

- ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన

- ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 (18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల వరకూ)

- బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

- ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం

- బీసీలకు 50 ఏళ్లకే పింఛన...

- ఫింఛన నెలకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తి దివ్యాంగులైతే రూ. 10 వేలు

- పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు... గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం

- వలంటీర్లకు నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 01 , 2024 | 01:02 AM

Advertising
Advertising