BRIDGE : బ్రిడ్జి కోసం ధర్నా
ABN , Publish Date - Oct 17 , 2024 | 12:23 AM
జాతీయ రహదారి పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని శింగనమల రహదారి పోరాట సమితి సభ్యులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పలు మార్లు అధికారులకు ప్రయోజనం లేకపోయిందన్నారు. గంటపాటు ధర్నా చేపట్టారు.
శింగనమల, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని శింగనమల రహదారి పోరాట సమితి సభ్యులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పలు మార్లు అధికారులకు ప్రయోజనం లేకపోయిందన్నారు. గంటపాటు ధర్నా చేపట్టారు. సీఐ కౌలుట్లయ్య అక్కడికి వచ్చి బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులతో మాట్లాడుతానని హమీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం వారు తహసీల్దార్ బ్రహ్మ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రాంచరణ్ యాదవ్ తదితరులు ప్రాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....