IQBAL : వైసీపీ మాటలు నమ్మకండి
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:56 AM
మైనార్టీలకోసం వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మకండని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన శనివారం హిందూ పురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రహమతపురం ప్రాంతంలో పర్యటించి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

టీడీపీనే మైనార్టీలకు అండ: ఎమ్మెల్సీ ఇక్బాల్
హిందూపురం, ఏప్రిల్ 27 : మైనార్టీలకోసం వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మకండని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన శనివారం హిందూ పురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రహమతపురం ప్రాంతంలో పర్యటించి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిపై లేనిపోని అసత్యఆరోపణలు చేస్తున్నారని దానిని మైనార్టీలు నమ్మకూడదన్నారు. టీడీపీ హయాంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ వైసీపీ ఐదేళ్లలో వాటిని రద్దు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన అనిల్‌కుమార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్, దాదాపీర్, హిదాయత, డైండ్బాబా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....