AP NEWS: కాల్పుల కలకలం..ఉలిక్కిపడిన అన్నమయ్య జిల్లా
ABN, Publish Date - Dec 22 , 2024 | 07:45 AM
వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా: వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... అన్నమయ్య జిల్లాలో ఇవాళ(ఆదివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం కాటిమ యకుంటలో కాల్పుల జరిగాయి. కాల్పుల ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాటిమయ్య కుంట- మద్దెల కుంట మార్గ మధ్యంలో ఈ ఘటన జరిగింది. హనుమంతు (45),రమణ (30) అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సంబేపల్లికు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చిక్కు వెంట్రుకల వ్యాపారం చేసేందుకు వెళ్తుండగా ఇవాళ తెల్లవారుజామున మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది. దుండగులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కాల్పులు జరగడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితోనైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు
CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ
Mystery Unfolds : మరిదే సూత్రధారి!
Read Latest AP News and Telugu News
Updated Date - Dec 22 , 2024 | 11:41 AM